News September 12, 2025

ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం

image

33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ములుగు, ఏటూరునాగారం, మంగపేటతో సహా పలు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని ఆయన వివరించారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News September 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 13, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
✒ ఇష: రాత్రి 7.32 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 13, 2025

‘పెద్దారెడ్డి ఇంటికి కొలతలు.. 2 సెంట్ల ఆక్రమణల గుర్తింపు’

image

తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్‌ అధికారులు శుక్రవారం సర్వే చేశారు. పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేనట్లు గుర్తించారు. 12 సెంట్లలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. 2 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత చెప్పారు. సర్వే నివేదిక పంచనామాపై సంతకం చేయమని కోరగా పెద్దారెడ్డి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

News September 13, 2025

నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

image

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.