News September 12, 2025

రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.

Similar News

News September 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 13, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
✒ ఇష: రాత్రి 7.32 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 13, 2025

శుభ సమయం (13-09-2025) శనివారం

image

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.11.17 వరకు
✒ నక్షత్రం: కృత్తిక మ.2.55 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: తె.5.47లగాయతు
✒ అమృత ఘడియలు: మ.12.40-మ.2.09