News September 12, 2025

HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

image

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Similar News

News March 22, 2026

సిద్దిపేట జిల్లాలో కొండెక్కిన చికెన్ ధరలు

image

సిద్దిపేట జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులపై భారం పడుతోంది. ప్రస్తుతం డ్రస్డ్ చికెన్ కిలో రూ.307 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడటంతో ధరలు పెరిగాయని, ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

News March 22, 2026

పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.

News March 22, 2026

HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

image

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.