News September 12, 2025
USలో తల నరికిన ఘటన.. సంచలన విషయాలు

USలో భారత సంతతికి చెందిన నాగమల్లయ్యను కో-వర్కర్ మార్టినెజ్ తల నరికి <<17684402>>చంపిన<<>> విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. వాషింగ్ మెషీన్ పనిచేయట్లేదని నేరుగా చెప్పకుండా మరో ఉద్యోగినితో చెప్పించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. క్రిమినల్ నేపథ్యం ఉన్న మార్టినెజ్ ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి రిలీజయ్యాడు. అలాంటి వ్యక్తిని ఎలా వదిలేశారు? జాబ్ ఎందుకు ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News March 10, 2026
ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్‌పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.
News March 10, 2026
బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 10, 2026
చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.


