News September 12, 2025

రింగ్ రైల్‌‌తో మారనున్న HYD రూపురేఖలు

image

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?

Similar News

News March 10, 2026

గ్యాస్‌తో పని లేకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి

image

గల్ఫ్ యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు స్టవ్‌తో పనిలేని ఫుడ్ సిద్ధం చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, పూరి, వడ లాంటివి పక్కన పెట్టి సలాడ్స్, శాండ్‌విచ్, స్ప్రౌట్స్, మిక్స్‌డ్ ఫ్రూట్స్, బ్రెడ్-జామ్, బాయిల్డ్ ఎగ్స్(ఎగ్ బాయిలర్‌లో ఉడికించినవి), జ్యూస్‌లు తీసుకోవాలి. ఇవి మీ సిలిండర్‌ను ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యానికీ మంచివి.
Share it

News March 10, 2026

కేటిదొడ్డి: పాండురంగ స్వామి స్టేషన్ నుంచి డెమో రైళ్లు రద్దు

image

కేటిదొడ్డి మండలం కొండాపురం సమీపంలోని పాండురంగ స్వామి రైల్వే స్టేషన్ నుంచి నడిచే అన్ని డెమో (DEMO) రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ జి.మునీందర్ తెలిపారు. ఈ రద్దు మార్చి 11 నుంచి మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.

News March 10, 2026

గద్వాల: ‘ఓటరు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజా సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫార్మ్ 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేస్తూ కనీసం 85% పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.