News September 12, 2025
హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 11, 2026
నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది హాజరు

కడప జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి గణితం పరీక్ష 2,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,624 మంది పరీక్షలు రాశారు. 222 మంది ఆబ్సెంట్ అయ్యారు. హిస్టరీ పరీక్షకు 276 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 246 మంది వచ్చారు. 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.
News March 11, 2026
వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
News March 11, 2026
మధురవాడ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ఏసీబీ అధికారుల ఆరా

మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


