News September 12, 2025

అనకాపల్లి: ‘రాయితీపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవాలి’

image

పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. ఈ పథకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. దీనివల్ల వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందన్నారు.

Similar News

News March 23, 2026

ఈ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య: మాజీ CIA

image

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య అని మాజీ CIA లియోన్ పనెట్టా విమర్శించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందని తెలిసినా ట్రంప్ యంత్రాంగం ముందస్తు ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి దిగిందని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా మరింత కఠినమైన నాయకత్వం చేతుల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. USలో పెరుగుతున్న ఇంధన ధరలు, 59% ప్రజల వ్యతిరేకత ట్రంప్‌ను ఇరకాటంలో నెట్టాయన్నారు.

News March 23, 2026

యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

image

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.

News March 23, 2026

కట్టంగూరు: స్విమ్మింగ్ పూల్‌లో మాజీ సైనికుడి మృతి

image

కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెల్లి జనార్ధన్ (50) ఆదివారం సాయంత్రం కట్టంగూరులోని ఒక స్విమ్మింగ్ పూల్‌కు ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.