News September 12, 2025

ADB: ‘ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి’

image

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్‌లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

ADB: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

image

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ, భూ వివాదాలు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రజావానికి 101 ఫిర్యాదులు: ఆదిలాబాద్ కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను సమయానికి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 101 ఫిర్యాదులు అందయన్నారు.