News September 12, 2025

HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

image

HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ (DGQA) ప్రకటించింది. మిలిటరీ డ్రోన్ డెవలప్మెంట్ కోసం ఇదొక వేదిక కానుంది అని పేర్కొన్నారు. అంతేకాక, UAV, డ్రోన్ సామర్థ్యాలను పెంచే దిశగా అడుగులు పడనున్నట్లు తెలిపారు. ఈ కీలక అడుగు డ్రోన్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.

Similar News

News March 17, 2026

గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవద్దు: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 9,800 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఆయిల్ కంపెనీల ద్వారా ప్రతిరోజూ తగినంత నిల్వలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గృహ అవసరాల గ్యాస్ సరఫరాపై వచ్చే అపోహలను ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

News March 17, 2026

నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

image

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.

News March 17, 2026

పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

image

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.