News September 12, 2025

పునర్విభజన చట్టం: HYD- అమరావతికి రైల్వే లైన్

image

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. GM సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని సైతం చెప్పారు.

Similar News

News March 8, 2026

రూ.5,812 కోట్లతో మూసీ నది ప్రాజెక్టు ఫేస్-1

image

రూ.5,812 కోట్లతో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఫేస్-1 పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.73.8 కోట్లు వెచ్చించనట్లు తెలిపారు. గాంధీ విగ్రహ వేదికకు రూ.22.6 కోట్లు, మ్యూజియం, భవనానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.79 కోట్లతో ఎలక్ట్రో-మెకానికల్ పనులు చేపట్టనున్నారు.

News March 8, 2026

HYD: యూట్యూబ్ చూసి డాలర్లలో సంపాదన!

image

HYD శివార్లలోని బాచుపల్లి, నిజాంపేట్ బస్తీల్లో ఇప్పుడు సీన్ మారింది. కుర్రాళ్లు సాయంత్రం అయితే చాలు కిరాణా కొట్టుల దగ్గర కూర్చుని ‘పైథాన్’ కోడింగ్ చిక్కుముడులు విప్పుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఆఫీసుల ఏసీ గదుల కంటే గల్లీలోని వేపచెట్టు కింద కూర్చుని విదేశీ క్లయింట్లకు ప్రాజెక్టులు చేసివ్వడమే వీరి స్టైల్. ఏ డిగ్రీలు లేకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకున్న విద్యతో డాలర్లు సంపాదిస్తున్నారు.

News March 8, 2026

HYD: ఈ వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

హైదరాబాద్‌లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ సరికొత్త వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై చెత్త, నిండిన బిన్లు, మురుగునాళాల సమస్యలపై పౌరులు ఇకపై నేరుగా 8125966586 నంబర్‌కు ఫొటో, లొకేషన్‌ను వాట్సాప్ చేయవచ్చు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.