News September 12, 2025
నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

కలెక్టర్ డా. జి. లక్ష్మీశా శుక్రవారం రాత్రి విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట, పరిసర ప్రాంతాల్లోని 11 వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజూ ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహణ, డయేరియా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం తదితరాలపై సూచనలు చేశారు. ప్రత్యేక కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 21, 2026
NZB: పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి

NZB నగరంలోని పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి నిర్వహించింది. శుక్రవారం 6వ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ మిషన్ భగీరథ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నామని CCS ACP మస్తాన్ వలీ చెప్పారు. 4 సెల్ ఫోన్లు, 4 బైక్‌లు, ఒక ఆటో, రూ.11,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించామన్నారు.
News March 21, 2026
పెద్దపల్లి: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ఉన్నత విద్య కోసం ఎస్సీ విద్యార్థులు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ తెలిపారు. 4 సంవత్సరాల డిగ్రీ చదివి గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు, కుటుంబ ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 21, 2026
రాజీవ్ యువ వికాసానికి రూ.6,000 కోట్లు

TG: బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించింది. దీంతో కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ స్కీమ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా వారికి చేయూత ఇవ్వనుంది. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పాలనుకొనే వారికి ఈ పథకం ద్వారా ఒక్కో అభ్యర్థికి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం అందించనుంది.


