News September 12, 2025

MNCL: ‘సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి రాజ్యం’

image

సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రాజ్యం నడిపిస్తోందని HMS గౌరవ అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం హైదారాబాద్‌లో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కాంట్రాక్టులో జరుగుతున్న 25 శాతం అవినీతిలో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని ఆరోపించారు. అవినీతిని అడ్డుకోకపోతే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే సీబీఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Similar News

News March 11, 2026

విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

image

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. అతడితో విడాకుల పక్రియ ఇవాళ పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను హన్సిక 2022లో వివాహమాడారు. అయితే అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్‌, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.

News March 11, 2026

NGKL: విద్యుత్ సమస్యలా? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి!

image

జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేదా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. వేసవి దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం 8712491184 నెంబర్‌కు 24/7 సంప్రదించవచ్చని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News March 11, 2026

భామిని: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుపై ఫీజుబులిటి టీం పరిశీలన

image

హైయిర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు, బామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఫీజుబులిటీ టీం బుధవారం పరిశీలన చేసింది. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, అంశాలను రెవెన్యూ శాఖతో చర్చించారు. ఫీజుబు‌లిటీ టీంలో పాలకొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎం. శ్యాంబాబు, సీతంపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వి ప్రభాకర్ రావు, పాలకొండ డిగ్రీ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసరావు ఉన్నారు.