News September 12, 2025
KMM: సాయిరాం ఆసుపత్రిపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం: డా.సునీల్

సాయిరాం ఆస్పత్రిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని డా.జంగాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల తమ ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలుడు కాలేయం క్షీణత వ్యాధి సమస్యతో ప్రాణాపాయస్థితిలో చేరాడని చెప్పారు. ముందుగా బాలుడికి పసర నాటువైద్యం వాడడంతో మూత్రపిండాల వైఫల్యమైందని, చివరి ప్రయత్నంగా తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు.
Similar News
News March 12, 2026
అమరావతిలో S+12 అంతస్తులతో 6 టవర్స్

అమరావతిలోని రాయపూడిలో AIS అధికారుల టవర్స్ నిర్మాణాన్ని APCRDA ఆధ్వర్యంలో కొనసాగిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో S+12 అంతస్తులతో 6 టవర్స్‌లో మొత్తం 144 విశాలమైన నివాస యూనిట్లు (సుమారు 3,500 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
News March 12, 2026
చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.
News March 12, 2026
నస్పూర్: ‘ఆన్ లైన్‌లో సిలిండర్ బుక్ చేసుకోవాలి’

గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్‌లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఎల్పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు.


