News September 12, 2025

ఏనుమాముల మార్కెట్‌యార్డులో ఈవీఎంల పరిశీలన

image

వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs)ను జిల్లా కలెక్టర్ సత్య శారదా పరిశీలించారు. ఈ తనిఖీలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీలు, నిల్వ విధానం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. పారదర్శకతను కాపాడుతూ ఎన్నికల పక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే ఈ తనిఖీ లక్ష్యమని తెలిపారు.

Similar News

News March 5, 2026

WGL: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక!

image

జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’కు రంగం సిద్ధమైంది. జూన్ 15 వరకు సాగే ఈ కార్యక్రమంలో తొలిదశ పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, బాలల భద్రతపై ప్రత్యేక డ్రైవ్‌లు, మేలో రైతు సమస్యలు, విద్య, క్రీడలు, మహిళా సాధికారతపై దృష్టి సారించనుండగా, జూన్‌లో పర్యావరణ పరిరక్షణతో ఈ ప్రణాళిక ముగియనుంది.

News March 3, 2026

సీఎం సమీక్ష.. పాల్గొన్న వరంగల్ కలెక్టర్

image

ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై స్పష్టత ఇవ్వాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News March 3, 2026

అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.