News September 12, 2025
చాగలమర్రి: కుందూ నదికి పోటెత్తిన వరద

భారీ వర్షాల కారణంగా చాగలమర్రి మండలం కుందూ నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాగలమర్రి మండలంలో 13 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుందూ నదిలో 28 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాగలమర్రి తహశీల్దార్ విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 13, 2025
HYD: ప్రకృతే మెడిసిన్.. ఆరోగ్యానికి ఇలా చేయండి

మనసును, శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. టాబ్లెట్లు, మెడిసిన్లు మాత్రమే సరిపోవు! ప్రతిరోజు వ్యాయామం, స్వచ్ఛమైన పర్యావరణం, పౌష్టిక ఆహారం, కూరగాయలు, సూర్య రష్మీ, ఫాస్టింగ్, నవ్వుతూ గడపడం, సరైన నిద్ర, మెడిటేషన్, స్నేహితులతో గడపడం, సేవ చేయడమే మన ప్రకృతి మెడిసిన్ అని మల్కాజిగిరి DCP పద్మజ అన్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యంగా జీవించండి!
News September 13, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.
News September 13, 2025
ములుగు: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 91 మందికి జరిమానా

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 91 మందికి ములుగు కోర్టు జరిమానా విధించిందని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 85 మందికి రూ.1,68,000 జరిమానా, ఆరుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.12000 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.