News September 12, 2025
ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి

బాపట్లలో శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో న్యాయవాది చిన్నుకొని జనార్దన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్సకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News March 14, 2026
మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

నందిగరువులో నిర్వహించిన మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు విని కొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందుకే నేరుగా వచ్చి సమస్యల వింటున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.
News March 14, 2026
GWL: సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.
News March 14, 2026
కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.


