News September 12, 2025
అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
Similar News
News March 12, 2026
నానుడి.. ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటే ఏమిటి?

పైకి ప్రేమ నటిస్తూ లోపల ద్వేషంతో అవతలి వ్యక్తిని నాశనం చేయాలని ఇచ్చే కౌగిలింతను ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటారు. భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా బలవంతుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆశీర్వాదం కోసం పాండవులు వస్తారు. తన 100 మంది కొడుకులనూ చంపిన భీముడిని నలిపి చంపాలని ఆయన ప్రయత్నించగా కృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ఉంచి కాపాడతారు. మీ జీవితంలో ధృతరాష్ట్ర కౌగిలి ఇచ్చేవారెవరో కామెంట్.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 12, 2026
క్రాష్ కంటిన్యూ.. 800 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు కోల్పోయి 76,034కు చేరగా.. నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ టాప్ 30 సూచీలో NTPC, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, HCL టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలతోనే ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరల హైక్, భారత్ సహా 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించడం, FII సెల్లింగ్, రూపీ క్షీణత సూచీలపై ప్రభావం చూపించింది.
News March 12, 2026
సచిన్‌ను తప్పించాలనుకున్నాం: మాజీ సెలక్టర్

‘సచిన్ మీ ప్లాన్స్ ఏంటి? మిమ్మల్ని తప్పించి వేరే ప్లేయర్‌ను తీసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పగానే టెండూల్కర్ షాకయ్యారని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘మీరు సీరియస్‌గానే అంటున్నారా?’ అని సచిన్ తిరిగి ప్రశ్నించగా అవునని సమాధానం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. నిజానికి సచిన్ మరికొంత కాలం ఆడాలనుకున్నారని చెప్పారు. 2013లో రిటైర్‌మెంట్‌కు ముందు జరిగిన ఘటనలను పాటిల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.


