News September 12, 2025
RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి: శ్రీహరి

AP: గుంటూరు(D) తురకపాలెంలో AP మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీహరి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పర్యటించారు. ‘చికిత్స కోసం వైద్య శిబిరానికి వచ్చే వారి సంఖ్య తగ్గింది. పరిస్థితి అదుపులోనే ఉంది. స్థానిక RMP అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చాడు. RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం’ అని శ్రీహరి హెచ్చరించారు. తురకపాలెంలో ఇటీవల వరుస మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫాస్ట్ రిజల్ట్స్‌కు Way2Newsను ఫాలో అవ్వండి.
News February 13, 2026
టుడే టాప్ స్టోరీస్

* 2029లో జమిలి ఎన్నికలు: సీఎం రేవంత్
* నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు: సీఎం రేవంత్
* ఒక్క ఐటీ జాబ్‌తో ఆరుగురికి ఉపాధి: మంత్రి లోకేశ్
* లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్
* రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
* నమీబియాపై భారత్ ఘన విజయం
* స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
News February 13, 2026
నేతల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ కలయిక

AP: మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలతో ఉండవల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, MLAలు యార్లగడ్డ, కృష్ణప్రసాద్, బుద్ధ ప్రసాద్, వర్లకుమార్, బోడే ప్రసాద్, చీఫ్ విప్ ఆంజనేయులు కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి విందు చేశారు. ఈ సందర్భంగా నేతల సతీమణులకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.


