News September 12, 2025

ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

image

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.

Similar News

News March 17, 2026

ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.

News March 17, 2026

ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.

News March 17, 2026

ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

image

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.