News September 12, 2025
అమరావతి ORR అప్డేట్

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.
Similar News
News March 26, 2026
రేపు వైన్స్ బంద్

TG: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు శుక్రవారం బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలు రేపు మూసి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వైన్స్‌తో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, మిలిటరీ క్యాంటీన్లు బంద్ చేయాలని హైదరాబాద్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి.
News March 26, 2026
KNR: లెక్కలు చెప్పాల్సిందే.. ఈనెల 29 వరకే ఛాన్స్

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 29లోపు తమ ఖర్చుల లెక్కలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సిందేనని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులో లెక్కలు ఇవ్వనట్లయితే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు తమ పదవులను కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఈనెల 29లోపు తమ ఎన్నికల లెక్కలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
News March 26, 2026
ఇరాన్‌కు షాక్.. హార్ముజ్ బ్లాక్ చేసిన నేవీ చీఫ్ హతం!

హార్ముజ్ ఒడ్డున ఉండే బందర్ అబ్బాస్ సిటీపై జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్ముజ్‌ను బ్లాక్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ జలసంధిపై పట్టు కోసం యుద్ధం సాగుతున్న వేళ ఇది కీలక పరిణామంగా మారింది.


