News September 12, 2025
అమరావతిలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్

భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ సౌకర్యం అమరావతిలో రానుంది. క్వాంటం వ్యాలీ “క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్” ప్రాజెక్ట్‌ను పొందనున్నట్లు తెలుస్తోంది. క్వాంటం వ్యాలీలో దీనిని అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ స్థాపించనుంది. దీని పెట్టుబడి సుమారు 200 కోట్లు అంచనా వేస్తున్నారు. 49.66 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానున్నట్లు సమాచారం.
Similar News
News March 24, 2026
TU: పరీక్షల ఫలితాలు విడుదల

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని B.Ed, B.P.Ed 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. టీయూ ఉపకులపతి ప్రొ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఫలితాలను విడుదల చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ.సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.సంపత్, డా.శాంతాబాయి డా.నందిని పాల్గొన్నారు.
News March 24, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.
News March 24, 2026
స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడం ద్వారా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.


