News September 12, 2025
విశాఖ: నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గోడ పత్రిక ఆవిష్కరించారు. జిల్లాలో 58 వేల పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. రైతులు పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని కోరారు.
Similar News
News March 4, 2026
విశాఖ: రైలు ప్రయాణికులకు అలెర్ట్

వాల్తేర్ డివిజన్‌లోని శిలిమ్లిగూడ-కరకవలస మధ్య డబుల్ లైన్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ మధ్య నడిచే (58501, 58502) ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
News March 3, 2026
విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.
News March 3, 2026
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.


