News September 12, 2025
విశాఖ: ‘మందుల విక్రయాలు జాగ్రత్తగా నిర్వహించాలి’

విశాఖలోని VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో మందుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ విజయకుమార్ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత పాల్గొని డ్రగ్స్ పై వివరించారు.
Similar News
News March 17, 2026
ఎట్టకేలకు విశాఖ డీఆర్‌వో పోస్టు భర్తీ

విశాఖ జిల్లాలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న డీఆర్‌వో పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కడప జిల్లా డీఆర్‌వో (స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖకు బదిలీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్‌వో భవాని శంకర్ మధ్య విభేదాల కారణంగా ఇద్దరినీ రిలీవ్ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉండగా, తాజా నియామకంతో అనిశ్చితికి ముగింపు పలికింది.
News March 17, 2026
విశాఖ: అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీసుల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లు గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజులు ముందే డీవోలు సిద్ధమైనా.. సంబంధిత స్టేషన్‌కు ఆలస్యంగా అందాయి.
News March 17, 2026
విశాఖ నుంచి బెంగళూరు, చర్లపల్లి రైళ్లు క్రమబద్ధీకరణ

విశాఖపట్నం నుంచి నడిచే రెండు ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రమబద్ధీకరించింది. విశాఖ-SMVT బెంగళూరు (18509/10) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం, విశాఖ-చర్లపల్లి (18527/28) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. బెంగళూరు రైలు రేణిగుంట మీదుగా, చర్లపల్లి రైలు వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ శాశ్వత సేవలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.


