News September 12, 2025
వంగూర్: బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి

బైక్‌పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వంగూర్ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట(M) అక్కారం తాండాకు చెందిన బాలునాయక్ తన భార్య కళతో కలిసి కల్వకుర్తి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగూర్ గేటు వద్ద బైక్‌పై నుంచి కళ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 17, 2026
IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT
News March 17, 2026
నల్గొండ: 20న బడ్జెట్.. ఇకనైనా పూర్తి చేస్తారా..!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లోని సమీకృత మార్కెట్లు, మిని ట్యాంక్ బండ్ల నిర్మాణాలకు నిధులు వస్తాయని ఆశిస్తున్నారు.
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్‌పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


