News September 12, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐల బదిలీలు

ఆసిఫాబాద్ జిల్లాలో పలువురు SIలను బదిలీ చేస్తూ రామగుండం CP ఉత్తర్వులు జారీ చేశారు. SI-II, సిర్పూర్-T PD Att. కాగజ్‌నగర్-టి PSలో విధులు నిర్వహిస్తున్న సురేష్‌ను సిర్పూర్-T PSకు, సిర్పూర్-T SI ఎం.కమలాకర్‌ను VR KBM ఆసిఫాబాద్‌కు, VR, KBM ఆసిఫాబాద్‌లో ఉన్న డి.చంద్రశేఖర్‌ను కౌటాలకు, కౌటాలలో విధులు నిర్వహిస్తున్న జి.విజయ్‌ను VR కల్పించారు.
Similar News
News March 22, 2026
నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
News March 22, 2026
అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
News March 22, 2026
జగన్ హయాంలో ఏపీకి ఆర్థిక నష్టం: రామ్మోహన్ నాయుడు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని చెప్పుకొచ్చారు. సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం అరసవిల్లిలో ఓ కార్యక్రమంలో రామ్మోహన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.


