News September 12, 2025
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కనీసం 70 శాతం మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. విద్యార్థులకు సరైన బోధన అందించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 13, 2025
చెమట సుక్కకు సలాం కొట్టిన MHBD ఎస్పీ

మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలకు యూరియా అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న హమాలీ కార్మికుల శ్రమను అభినందించారు. నర్సింహులపేటలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, హమాలీలతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పంలో హమాలీల పాత్ర కీలకమని, వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా సాగుతోందన్నారు.
News September 13, 2025
ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News September 13, 2025
‘రాజాసాబ్’ రిలీజ్‌ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్‌ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్‌పై ప్రశంసలొస్తున్నాయి.