News September 12, 2025

అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్దగల చెన్నకేశవస్వామి గుడి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ(70), రామచంద్రయ్య(50) మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News September 13, 2025

వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

image

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్‌(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

News September 13, 2025

చెమట సుక్కకు సలాం కొట్టిన MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలకు యూరియా అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న హమాలీ కార్మికుల శ్రమను అభినందించారు. నర్సింహులపేటలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, హమాలీలతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పంలో హమాలీల పాత్ర కీలకమని, వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా సాగుతోందన్నారు.

News September 13, 2025

ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

image

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.