News September 12, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్..!

image

> జనగామ: ఇందిరమ్మ ఇళ్ల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్
> రైతులకు సరిపడా యూరియా అందించాలి: ఎర్రబెల్లి
> పాలకుర్తిలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
> స్టేషన్ ఘనపూర్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన
> చిల్పూర్: కస్తూర్బా విద్యాలయంలో ఎంపీడీవో తనిఖీలు
> జనగామ ఆర్టీసీ డిపో నుంచి కొత్త టూర్ ప్యాకేజీలు

Similar News

News September 13, 2025

అంగన్‌వాడీల్లో హెల్పర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో సహాయకుల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయకుల నియామకంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది.

News September 13, 2025

వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

image

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్‌(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

News September 13, 2025

చెమట సుక్కకు సలాం కొట్టిన MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలకు యూరియా అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న హమాలీ కార్మికుల శ్రమను అభినందించారు. నర్సింహులపేటలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, హమాలీలతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పంలో హమాలీల పాత్ర కీలకమని, వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా సాగుతోందన్నారు.