News September 12, 2025

పెద్దపల్లి: ‘బైపాస్ రోడ్డుకు భూములు ఇస్తాం’

image

గోదావరి తీరంపై ప్రతిపాదిత మంచిర్యాల-పెద్దపల్లి వంతెన నిర్మాణ బైపాస్ రహదారి మార్గాన్ని నూతనంగా మళ్లించడం కాకుండా, ప్రస్తుతం ఉన్న రహదారి ద్వారానే తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఇలా చేస్తే మంథని బస్ డిపో వరకు రహదారి చేరి పట్టణం, వ్యాపారాలు, ఆసుపత్రులు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి శ్రీధర్ బాబుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

Similar News

News March 10, 2026

గుంటూరు ‘పుర’ అధికారుల నియామకం

image

గుంటూరు జిల్లాలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో GMCకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, తెనాలికి గుంటూరు JC అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. మార్చి 17న ప్రస్తుత పాలకవర్గం బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.

News March 10, 2026

తూ.గో: గోదావరిలో దూకిన భార్య.. పోలీసులకు భర్త ఫోన్.. చివరికి

image

కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 40 ఏళ్ల మహిళను పోలీసులు కాపాడారు. ఆమె భర్త 112కు కాల్ చేయడంతో SP డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పోలీసులు వెంటనే స్పందించారు. నదిలోకి దిగి చాకచక్యంగా మహిళను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు రక్షించారు. సకాలంలో స్పందించిన పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News March 10, 2026

పాలమూరు: బి.ఎడ్, ఫామ్-డి ఫలితాలు విడుదల

image

పాలమూరు విశ్వవిద్యాలయం బి.ఎడ్ మొదటి సెమిస్టర్, ఫామ్-డి (1 నుంచి 5 ఏళ్లు) ఫలితాలను వీసీ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. బి.ఎడ్ ఫలితాల్లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి ప్రవీణ పాల్గొని వివరాలు వెల్లడించారు.