News September 13, 2025

పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

image

ఆసియా కప్ 2025లో ఒమన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.

Similar News

News September 13, 2025

అంగన్‌వాడీల్లో హెల్పర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో సహాయకుల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయకుల నియామకంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది.

News September 13, 2025

వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

image

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్‌(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

News September 13, 2025

‘రాజాసాబ్’ రిలీజ్‌ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్‌ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్‌పై ప్రశంసలొస్తున్నాయి.