News September 13, 2025

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

image

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిరుద్యోగ మహిళలకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని ఆర్.జీ-3 సేవా అధ్యక్షురాలు ఎన్.అలివేణి సుధాకరరావు తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పొందిన 183 మహిళలకు ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయం ఆధ్వర్యంలో రాతపరీక్ష నిర్వహించారు. శిక్షణను వినియోగించుకొని మార్కెట్ పోటీకి సిద్ధం కావాలని సూచించారు.

Similar News

News March 15, 2026

జగిత్యాల: సైబర్ మోసగాళ్ల వలలో పోలీసు అధికారి.!

image

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.

News March 15, 2026

నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

image

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 15, 2026

పాలమూరు: వినియోగదారా మేల్కో.. మోసపోతే ఫిర్యాదు చేయి!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల కల్తీ పెరిగిపోయి సామాన్యూడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఈ సమస్యపై ఉమ్మడి జిల్లాలో ఆరేళ్లలో 668 కేసులు నమోదవగా, 173 పెండింగ్‌లో ఉన్నాయి. వ్యాపారుల మోసాలను ఎదిరించడమే వినియోగదారుడి హక్కు. నేడు ‘WORLD CONSUMER RIGHTS DAY’న ఈ నంబర్లను గుర్తుంచుకోండి:
1: 1915, 1800114000
2: 180042500333
3: 1967
4: 08542245633
మోసాన్ని ప్రశ్నించి, రశీదు తప్పనిసరిగా తీసుకోండి.