News September 13, 2025

ధర్మారం: ప్రిన్సిపల్, విద్యార్థులకు కలెక్టర్ అభినందన

image

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, పలువురు విద్యార్థులను కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులతో మిడ్ డే మీల్స్ చేయడం, భోజన సమయంలో గ్రీన్ FM రేడియో నిర్వహణ, ప్లాస్టిక్ రహిత పాఠశాల, ఫొటో విత్ మంత్లీ మ్యాగజైన్, ప్లే ఫర్ ఆల్ కార్యక్రమాల నిర్వహణ, హాజరు, జాయినింగ్ శాతం పెంపొందించడంపై కలెక్టర్ అభినందించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.

Similar News

News March 16, 2026

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

image

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

ఖమ్మం: KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‌లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.

News March 16, 2026

ఈనెల 25తో ముగియనున్న రైతన్న మీ కోసం: JC

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కర పత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 25తో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా సంపద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ ఉన్నారు.