News September 13, 2025
విదేశీ ఉపాధి అవకాశాల వినియోగంపై దృష్టి పెట్టాలి: పెద్దపల్లి కలెక్టర్

TG iPASS కింద వచ్చిన ప్రతి దరఖాస్తు నిర్దిష్ట గడువులో అనుమతులు ఇవ్వాలని, ఫైల్ మూమెంట్‌లో ఆలస్యం లేకుండా అధికారులు టైమ్ బౌండ్ విధానంలో పనిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఈరోజు పరిశ్రమలు, DEET అధికారులతో సమావేశం నిర్వహించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాల వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల అధికారి కీర్తి కాంత్ పాల్గొన్నారు.
Similar News
News September 13, 2025
త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

TG: జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.
News September 13, 2025
నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.
News September 13, 2025
అంగన్‌వాడీల్లో హెల్పర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో సహాయకుల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయకుల నియామకంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది.