News September 13, 2025

గోదావరిఖని: దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి

image

గోదావరిఖనిలోని కోదండ రామాలయ జూనియర్‌ అసిస్టెంట్‌, కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఎల్‌బీనగర్‌కు చెందిన మామిడి కుమారస్వామి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని వీరు అక్రమంగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో బదిలీ చేసుకుంటున్నారని తెలిపారు. భక్తులతో కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News September 13, 2025

థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

image

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

News September 13, 2025

త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

image

TG: జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.

News September 13, 2025

నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

image

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.