News September 13, 2025

HNK: ఈనెల 14న ఎన్డీఏ & సీడీఎస్ పరీక్ష

image

ఈనెల 14న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్(సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాల్లో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

Similar News

News March 10, 2026

తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

image

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.

News March 10, 2026

రూ.25 లక్షల చోరీ కేసులో ఇద్దరికి 2 ఏళ్ల జైలు

image

అక్టోబర్ నెలలో హైదరాబాద్, బెంగళూరు బస్సులో జరిగిన రూ.25 లక్షల దొంగతనం కేసులో ఇద్దరికి డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.జ్యోతి 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వెల్దుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.మధుసూదన్ రావు దర్యాప్తులో మహమ్మద్ షహీద్(35), సుహేబ్(20)ను అరెస్టు చేశారు. కేసును విజయవంతంగా నడిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్ రావు, పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.

News March 10, 2026

జగిత్యాల: మద్యం మత్తులో ప్రాణం తీస్తే.. ఎనిమిదేళ్ల జైలు

image

మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో జగిత్యాల ప్రధాన సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్ మృతికి కారణమైన వేంపేట్‌కి చెందిన మారంపెల్లి నవీన్‌కు కోర్టు 8 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.10 వెల జరిమానా విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమాని మారంపెల్లి అంజయ్యకు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.