News September 13, 2025

పెద్దపల్లి: స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్ ఆవిష్కరణ

image

సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, DPO వీర బుచ్చయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, DWO వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 13, 2025

త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

image

TG: జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.

News September 13, 2025

నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

image

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.

News September 13, 2025

అంగన్‌వాడీల్లో హెల్పర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో సహాయకుల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయకుల నియామకంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది.