News September 13, 2025
JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News September 13, 2025
థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
News September 13, 2025
త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

TG: జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.
News September 13, 2025
నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.