News September 13, 2025

నిధులతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: ఎంపీ పుట్టా

image

కేంద్రం నుంచి విడుదలైన నిధులను సక్రమంగా వినియోగించి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నిధులతో జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News March 22, 2026

నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం: SP

image

నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. శనివారం బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన కోర్టు కానిస్టేబుల్స్‌తో సమీక్షించారు. కోర్ట్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కోర్టు కానిస్టేబుల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.

News March 22, 2026

TODAY HEADLINES

image

☛ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు
☛ హార్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ
☛ ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్
☛ రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
☛ తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: CBN
☛ AP: ‘గురుకుల’ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
☛ ఆగమశాస్త్రానుసారం ‘భద్రాచలం’ అభివృద్ధి: రేవంత్
☛ 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో ఎన్నో లాభాలు: KTR

News March 22, 2026

ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

image

క్రేజ్‌‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.