News September 13, 2025
డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

డిగ్రీ ప్రవేశాలకు చివరి విడతగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.సునీత తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొందేందుకు ఉన్నత విద్యా మండలి ఈ షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News March 7, 2026
ఖాకీ కొలువుల కోసం DSNRలో భారీ ర్యాలీ!

పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు. సర్కారు కాలయాపన చేస్తే ఆక్రోశం తప్పదని ఆకాశ్, శంకర్ బృందం హెచ్చరించింది.
News March 7, 2026
AIతో భారీగా ఉద్యోగాలేమీ పోలేదు: ఆంథ్రోపిక్ రిపోర్ట్

ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోలేదని ఆంథ్రోపిక్ వెల్లడించింది. టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్స్‌లో యువ ఉద్యోగుల నియామకాలు తగ్గాయని ఓ నివేదికలో తెలిపింది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలసిస్, రొటీన్ డిజిటల్ డ్యూటీలను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువని చెప్పుకొచ్చింది. మెకానిక్‌లు, వంటవాళ్లు.. ఇలా మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు సమస్య లేదని పేర్కొంది.
News March 7, 2026
ఆర్టీసీ ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలు: ఆర్ఎం

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వరంగల్ RM విజయభాను తెలిపారు. హనుమకొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.


