News September 13, 2025
వేములవాడ: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 130 మందికి జరిమానా

వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 130 మంది పట్టుబడ్డారు. కోర్టు 70 మందికి రూ.2,000, 30 మందికి రూ.5,000, 30 మందికి రూ.10,000 జరిమానా విధించింది. పట్టుబడిన వారికి శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించిన పట్టణ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్ఐ రాజు ఉన్నారు.
Similar News
News March 17, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెగ్యులర్ ధరలతో టికెట్లు అందుబాటులో ఉండటంతో ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఈ నెల 19న ఉ.7.30 గంటలకు మొదటి షో పడనుంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం <<19374694>>అనుమతినిచ్చిన<<>> సంగతి తెలిసిందే. అక్కడ ఉ.4 గంటలకు బెనిఫిట్ షో పడనుంది.
News March 17, 2026
దోర్నాల: ఈనెల 16 నుంచి 20 వరకు గేట్లు ఓపెన్

శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ దోర్నాల గణపతి చెక్ పోస్ట్ నుంచి రాత్రి వేళల్లో కూడా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ రాత్రి వేళల్లో కూడా వాహనాలు శ్రీశైలానికి వెళ్తున్నాయి. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 16 నుంచి 20 వరకు అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 17, 2026
జగిత్యాలలో పసుపు క్వింటాల్ రూ. 11,500

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు(పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ రూ.11,500, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,000, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,791, కనిష్ఠం రూ. 1,521, కందులు గరిష్ఠం రూ. 6,911, కనిష్ఠం రూ. 5,636, పెసర్లు రూ. 7,250, అనుములు గరిష్ఠం రూ. 4,556, కనిష్ఠం రూ. 3,000, వరి (JSR) గరిష్ఠం రూ. 2,601, కనిష్ఠం రూ. 1,755గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


