News September 13, 2025
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి: పెద్దపల్లి కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి నిర్వహించిన సమీక్షలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక, మౌలిక వసతులపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్, టార్ఫాలిన్లు ఉండేలా చూడాలన్నారు.
Similar News
News March 4, 2026
రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
విజయవాడ IAS భార్య మృతి అప్డేట్ ఇదే..!

సీనియర్ IAS అధికారి GC కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమేనని ధ్రువీకరిస్తూ కేసును క్లోజ్ చేశారు. 2026 జనవరి 4న సత్య దీపిక మృతి చెందారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర దర్యాప్తు ఆధారంగా సత్యదీపిక మృతి అనుమానాస్పదం కాదని సహజ మరణమే అని తేల్చారు. దీంతో ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును అధికారికంగా మంగళవారం క్లోజ్ చేశారు.


