News September 13, 2025

జగిత్యాల: రైతుల భూవివాదం కలెక్టరేట్‌లో విచారణ

image

కొడిమ్యాల్ మండలం గౌరాపూర్‌కు చెందిన చింతపంటి నారాయణ(70)తోపాటు మరో ఆరుగురు భూస్వాములు తమ భూములు జాతీయ రహదారి-563 నాలుగు లేన్ల విస్తరణలో రావడం వల్ల ప్రభావితమవుతున్నాయని, భూ స్వాధీనంపై కలెక్టరేట్ ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆర్బిట్రేషన్ కింద అప్పీలు చేశారు. కలెక్టర్, ఆర్బిట్రేటర్ సత్య ప్రసాద్ కలెక్టరేట్‌లో వాదనలు విని, పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, మరో వారం గడువు ఇచ్చారు.

Similar News

News March 3, 2026

కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

image

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్‌కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 3, 2026

యాదాద్రి: స్వర్ణగిరి ఆలయం మూసివేత..!

image

చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు(కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తులు ఈ విజ్ఞప్తిని గమనించాలని ఆయన కోరారు.

News March 3, 2026

జగన్‌ను కలిసిన భట్టి

image

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.