News September 13, 2025
సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1929: స్వతంత్ర సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం (ఫొటోలో)
Similar News
News February 2, 2026
INC రెబల్స్‌కు 24 గంటల గడువు

TG: మున్సి‘పోల్స్’ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు వేసిన నామినేషన్లపై అందిన నివేదికను TPCC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ పరిశీలించారు. అనేక చోట్ల రెబల్స్ బెడద ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు బరి నుంచి తప్పుకొనేలా చేయాలని మంత్రులు, DCC అధ్యక్షులను ఆదేశించారు. దానిపై మళ్లీ నివేదిక సమర్పించాలని సూచించారు.
News February 2, 2026
అందుకే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు: మృణాల్

తాను నటిని కావడం వల్లే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పినట్లు మృణాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు చాలా ఇంపల్సివ్‌గా ఉంటావు. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు హీరోయిన్‌వి.. అది కూడా నాకు నచ్చదు’ అన్నాడని తెలిపారు. ఆ రిలేషన్ ముగిసిపోవడం తన మంచికేనని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేవని మృణాల్ అన్నారు. ఆమె నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News February 2, 2026
పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు.. నివారణ

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.


