News September 13, 2025
100 రోజుల్లో మేడారం మాస్టర్ ప్లాన్ పూర్తి: మంత్రులు

మేడారం మాస్టర్ ప్లాన్ పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. కోయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆధునికరించాలని మంత్రులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి సూచించిన మార్పులను వివరించారు.
Similar News
News September 13, 2025
నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్కర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
News September 13, 2025
తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

తిరుమలలో శ్రీవారి భక్తుల మొబైల్ ఫోన్లను దొంగలించే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.5 లక్షల విలువ గల 15 మొబైల్ ఫోన్లు, 20 గ్రా. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భక్తుడి ముసుగులో తరచుగా తిరుమల వస్తూ సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించే వాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెట్టు కిశోర్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.
News September 13, 2025
పార్వతీపురం: గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ప్రజా రవాణాధికారి కార్యక్రమానికి 26 వినతులు వచ్చాయి. ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, చివరి గ్రామాలకు బస్సు సౌకర్యం, స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.