News September 13, 2025

థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

image

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

Similar News

News February 12, 2026

ఈ 3 ఆహారాలు.. ‘లివర్’ కిల్లర్స్

image

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో <<19090434>>లివర్<<>> ఒకటి. దాన్ని ఈ 3 రకాల ఫుడ్స్ నాశనం చేస్తాయంటున్నారు వైద్యులు.
షుగర్ డ్రింక్స్: సోడాస్, ఫ్రూట్ జూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్.. లివర్‌కు విషం లాంటివి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్: ఇలాంటి ఆహారం తింటే లివర్ సెల్స్ డ్యామేజీ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు పెరుగుతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: చిప్స్, క్యాండీస్, హాట్ డాగ్స్, న్యూడుల్స్.. సీరియల్ కిల్లర్స్ లాంటివి.
#Shareit

News February 12, 2026

త్వరలో మొబైల్ అంగన్‌వాడీలు.. ఇంటికే సరుకులు

image

TG: అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. HYD, మేడ్చల్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వాహనాల‌ను వినియోగించాలని నిర్ణయించారు. HMDA పరిధిలోని 274 బస్తీల్లో 25,310 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వీటి ద్వారా టేక్ హోం రేషన్ విధానంలో ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తారు.

News February 12, 2026

ఇంటర్ పరీక్షల్లో అడిషనల్ ఆన్సర్ షీట్లు ఉండవు: బోర్డు

image

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు-2026లో విద్యార్థులకు అడిషనల్ ఆన్సర్ షీట్లను ఇవ్వబోమని బోర్డు ప్రకటించింది. ఫస్టియర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను అందిస్తామంది. మిగతా ఫస్టియర్, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు, సెకండియర్లోని అన్ని పేపర్లకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తామని తెలిపింది. పరీక్షలు ఉదయం 9-12 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది.