News September 13, 2025

రూ. 2,000 కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు: MP పుట్టా

image

జీలుగుమిల్లిలో రూ.2,000 కోట్ల నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు వస్తోందని ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. నేవీ అధికారులతో ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం ఎంపీ సమావేశమయ్యారు. ప్రాజెక్టు కోసం 1,116 ఎకరాల భూమి గుర్తించారన్నారు. భూసేకరణ పూర్తయితే పనులు మొదలవుతాయన్నారు. వచ్చే 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ తెలిపారు.

Similar News

News March 18, 2026

21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

image

దివ్యాంగ శక్తి కింద 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. కడప ఆర్టీసీ రీజనల్ పరిధిలో 18,790 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వాటికోసం రూ.18 లక్షల 79 వేల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. గతంలో 4 రకాల వైకల్యాలు ఉన్న దివ్యాంగులకు మాత్రమే రాయితీలు ఉండేవన్నారు.

News March 18, 2026

RR: వారికి డబుల్ బెడ్ రూమ్‌ రద్దు చేయండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.

News March 18, 2026

రైలు నుంచి జారిపడి మణుగూరు వ్యక్తి మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య(48) మృతి చెందారు. గుర్తుతెలియని రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు మోహన్రావుకు అప్పగించారు.