News September 13, 2025

NLG: మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు!

image

ఉమ్మడి NLG జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు నల్గొండ DCCB గుడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ వేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలు అందించనుంది. కాగా జిల్లాలో 1,255 మహిళా సంఘాలున్నాయి.

Similar News

News March 23, 2026

విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

image

పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్‌లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2026

MNCL: పదో తరగతి పరీక్షకు 22 మంది గైర్హాజరు

image

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన తృతీయ భాషా పరీక్షకు మొత్తం 9,690 మంది విద్యార్థులకు గాను 9,668 మంది హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,683 మందికి 9,663 మంది హాజరు కాగా, గతంలో ఫెయిలైన ఏడుగురిలో ఐదుగురు పరీక్ష రాశారు. మొత్తం 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

News March 23, 2026

ములుగు: రైతుల ఖాతాల్లోకి రూ.40.98 కోట్లు

image

యాసంగి రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో జిల్లాలోని 79,040 మంది రైతుల ఖాతాల్లోకి రూ.40,98,59,892ల జమయ్యాయి. మొత్తం 1.80లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 88,138 మంది రైతులు పట్టాలు పొంది ఉన్నారు. మిగతా వారికి ఈనెల 25 తర్వాత రెండో విడతలో పెట్టుబడి సాయం అందజేస్తారు. అకౌంట్లలోకి డబ్బులు జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.