News September 13, 2025

విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.

Similar News

News April 3, 2026

విశాఖ డివిజన్‌కు 7 రైల్వే స్టేషన్లు బదిలీ

image

ECoR కుర్దా రోడ్ డివిజన్లో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు SCoR విశాఖ డివిజన్‌కు బదిలీ కానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్త చేశారు. 2019లో జోన్ ప్రకటించినప్పటి నుంచి ఈ డిమాండ్‌ను తీసుకెళ్లినట్లు తెలిపారు. పలాస, సుమ్మా దేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లు విశాఖ డివిజన్‌కు బదిలీ కానున్నాయని తెలిపారు.

News April 3, 2026

విశాఖ: ప్రాణాలు కాపాడిన 112 కాల్

image

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మహారాణిపేట పోలీసులు కాపాడారు. గురువారం రాత్రి 112కి అందిన సమాచారంతో సీఐ దివాకర్ యాదవ్ బృందం గోకుల్ పార్క్ బీచ్‌కు చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

News April 3, 2026

రక్షణ శాఖ మంత్రి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

image

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.