News September 13, 2025
పెనుకొండలో భార్యను హత్య చేసిన భర్త

పెనుకొండలో భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అల్తాఫ్ ఖాన్ తన భార్య సుమియా భాను(27)ను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని గొడవపడేవాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆగస్టు 26న పిల్లలను, ఆమెను తన గదికి తీసుకెళ్లిన అల్తాఫ్ దారుణం కొట్టాడు. తీవ్రగాయాలైన సుమియాను కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లగా శుక్రవారం మృతిచెందింది.
Similar News
News March 7, 2026
ADB: జర జాగ్రత్త..!

మార్చి నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 38.7, ఆదిలాబాద్ 38.6, నిర్మల్ 38.6, కొమురం భీమ్ జిల్లాలో 38.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
News March 7, 2026
‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.
News March 7, 2026
నల్గొండ: తల్లి చనిపోయిన దుఃఖంలోనూ ఎగ్జామ్ రాశాడు

కన్నతల్లి మరణించినా, తన భవిష్యత్తు కోసం కన్నీటిని దిగమింగి పరీక్షా హాల్‌కు వెళ్లాడో విద్యార్థి. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన శివచరణ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి హేమలత శనివారం మృతి చెందారు. తల్లి మరణంతో శివచరణ్ పుట్టెడు దుఃఖంలోనూ మనోధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరయ్యాడు. శివచరణ్ పట్టుదలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.


