News September 13, 2025

ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

image

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 24, 2026

క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు: SC

image

SCల మతమార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే SC హక్కులు పొందుతారని పేర్కొంది. ‘కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు’ అని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో AP హైకోర్టు తీర్పును సమర్థించింది.

News March 24, 2026

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్స్ 30%కు పెంచాలి: AIDA

image

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే మోతాదు 20% నుంచి 30%కు పెంచాలని ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ (AIDA) కేంద్రాన్ని కోరింది. డీజిల్‌లోనూ ఇథనాల్ బ్లెండ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే అధిక మోతాదు ఇథనాల్‌తోనూ సమర్థంగా పనిచేయగలిగే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని కోరింది. దీని వల్ల చమురుపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొంది.

News March 24, 2026

HYDలో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదు: CP

image

TG: హైదరాబాద్‌లో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో బంకులు, ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీ పెంచవద్దని కోరారు. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన ‘X’ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలని ఆయన సూచించారు.